ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ పట్టణం గోసముద్ర తటాక తీరాన స్వయంబుగ వెలసిన మహిమాన్విత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ (విజయోత్సవ) జయంతి వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. ఆలయ వంశానుగత ధర్మకర్త కాకులవరం మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి 108 లీటర్ల ఆవుపాలతో పంచముఖ హనుమాన్ విగ్రహానికి అభిషేకం, అలంకరణ, మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ గావించారు. 108 పర్యాయాలు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేశారు. మెదక్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
ఎమ్మెల్యే పూజలు
ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వంశానుగత ధర్మకర్త కాకులవరం మధుసూదనాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసీ సత్కరించారు. వెంట మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధికా భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు దొంతి లక్ష్మి, రాజశేఖర్, శివరామ కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, మాజీ డైరెక్టర్ రాగి చక్రపాణి, మ్యాడం బాలకృష్ణ, బొజ్జ పవన్ తదితరులున్నారు.
బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తదితరులు దర్శించుకున్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.