ముద్ర కూకట్‌పల్లి :
మూడు వందల ఏళ్ల క్రితమే అన్యాయం, అవినీతిపై పోరాడి పేద ప్రజల పక్షాన నిలిచిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ కొనియాడారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్న గౌడ్ 319వ వర్ధంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. నాటి పాలకుల అరాచకాలను ఎదిరించిన పాపన్న గౌడ్ ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజం కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో గంట శ్రీనివాస్ గౌడ్, సంజీవ్ గౌడ్, హనుమంతు గౌడ్, శ్రీశైలం యాదవ్, రాజు శేఖర్, కొప్పిశెట్టి దినేష్, గాలి బాలాజీ, గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, సంతోష్, సాయిబాబా చౌదరి, బర్కత్ అలీ, కనకయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు