ముద్ర న్యూస్ బ్యూరో:
కాంగ్రెస్ పాలనలో పేదల పరిస్థితి అద్వాన్నంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలోని
తన వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ అయిన మాజీ సీఎం కేసీఆర్ ఇన్ని రోజులుగా తాను మౌనంగా ఉన్నానని, గంభీరంగా చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రజల పరిస్థితి కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టు అయిందని వాపోయారు. ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడదామని ఆయన అన్నారు. ఫిబ్రవరి నెలలో పెద్ద బహిరంగ సభ పెట్టుకుందామని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు.