Take a fresh look at your lifestyle.

ప్రతిభ కు దక్కిన ఫలితం – పాలమూరు కే వన్నె తెచ్చిన యెన్నం 

– ఎమ్మెల్యే యెన్నం కు విప్ పదవి దక్కడం పాలమూరుకు గర్వకారణం 

– ప్రతిభకు కట్టిన పదవి అని కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

 

ముద్ర, ఉమ్మడి 

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి అసెంబ్లీ లో ప్రభుత్వ విప్ గా నియమించడం ప్రతిభకు పట్టం కట్టినట్లయింది. ఎమ్మెల్యే గా ఎన్నికైనా దగ్గర నుంచి ఆయన తన నియోజకవర్గం అభివృద్ధి పైనే దృష్టి సారించారు. పాలమూరు లో విద్యాభివృద్ధికి విశేష కృషి అందిస్తున్నారు. నియోజకవర్గం లో తన పరిధి లో విద్యా నిధి ఏర్పాటు చేసి పేద విద్యార్థుల విద్య పై భరోసా కల్పించారు.ఇప్పటికే ఈ నిధికి ఎమ్మెల్యే వేతనం నుంచి ప్రతి నెలా రూ. లక్ష విరాళం ఇస్తున్నారు. ఈ నిధి నుంచి పేద విద్యార్థుల చదువుకు అవసరం అయ్యే విధంగా డబ్బులు స్ అందిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే చేయని ఈ సాహసానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి గా విరాళాలు అందజేస్తున్నారు. విద్య సంస్థలు,వివిధ పారిశ్రామిక వేత్తలు,ఉద్యోగస్థులు తమ వంతు సహాయంగా విరాళాలు అందించి ఎమ్మెల్యే ఆశయసాధనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ విరాళాలతో విద్యార్థుల కు అవసరమైన స్టడీ మెటీరియల్ తో పాటు డబ్బు సాయం అందుతోంది. ఇదొక్కటే కాకుండా ఐఐఐటి లో సీటు సంపాదించుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు.145 మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.ఇదొక్కటే కాకుండా నియోజకవర్గం అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని విజయతీరాలకు చేర్చడం లో ఎమ్మెల్యే సఫళీకృతులయ్యారు. మేయర్ పదవి కోసం అధిష్టానం తో కొట్లాడి తాను అనుకున్న విధంగా ముదిరాజ్ ఆడబిడ్డకు కట్టబెట్టడం లో తన పంతం నెగ్గించుకున్నారు. దీంతో బాటు తన అనుచరునికి డిప్యూటీ మేయర్ పదవి వచ్చేటట్లు వ్యూహం రచించారు. మున్సిపల్ కార్పొరేషన్ లో చరిత్ర తిరగరాశారు.ఇదేకాక రాష్ట్రం లో ఏ జిల్లా లో లేని విధంగా జర్నలిస్ట్ ల సంక్షేమాని కి తన వంతు సహాయంగా ప్రతి నెలా రూ. లక్ష అందించనున్నారు.నియోజకవర్గం లో ఇలా స్వచ్చంద్ర కార్యక్రమాలపై ఆయన దృష్టి పెట్టారు. ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యే లకు ఆదర్శం గా నిలుస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న  సీఎం రేవంత్ రెడ్డి ఆయన కు అసెంబ్లీ లో ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టారు. ఈ పదవికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వన్నె తెచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి పాలమూరు కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. యెన్నం కు విప్ రావడం పాలమూరు నియోజకవర్గానికి మంచిరోజులు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.