మాదాపూర్, ముద్ర విలేఖరి: గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా సాయిబాబా దేవాలయాల్లో పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ పాల్గొని పూజలు నిర్వహించారు. కూకట్ పల్లి డివిజన్ లోని ఆస్బెస్టాస్ కాలనీలోని సాయిబాబా దేవాలయం, హైదర్ నగర్ డివిజన్ లోని భాగ్యనగర్ కాలనీ సాయిబాబా దేవాలయం, హాఫ్పీజ్ పేట డివిజన్ మదీనగూడ రామక్రష్ణనగర్ కాలనీలోని ఉమామహేశ్వర స్వామి మరియు షిరిడీ సాయిబాబా ఆలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ గాంధీ మాట్లాడుతూ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమార్గంలో ముందుకు నడిపే జ్ఞానదాతలైన గురువులకు గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఆయా చోట్ల జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎర్రగుండ్ల శ్రీనివాస్, అస్టెస్టాస్ కాలనీ ప్రసిడెంట్ నరేష్, సైదేశ్వర్ రావు, రామలింగేశ్వర్ రావు, సుప్రజ, ప్రవీణ్, రాఘవరావు ఇతర భక్తులు పాల్గొన్నారు.ఆరు లక్షల రూపాయల ఎల్.ఒ.సి చెక్కులను పంపిణీ చేసిన పీయేసీ ఛైర్మన్ గాంధీ మాదాపూర్, ముద్ర విలేఖరి: ముఖ్య మంత్రి సహాయ నిధి ఎల్.ఒ.సి ద్వార మంజూరైన 6,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందచేసిన పీయేసీ చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ.శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలకి చెందిన పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 6,00,000 ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన ఎల్.ఒ.సి మంజూరి పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందచేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, పురందర్ రెడ్డి, నాని తదితరులు పాల్గొన్నారు.
