- యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి.
- ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి.
- సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి.
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న యూత్ కాంగ్రెస్ కు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 25శాతం రిజర్వేషన్ కల్పించేలా అధిస్ఠానం దృష్టికి కృషి చేస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తు యువతలోనే దాగి ఉందన్నారు. యువతకు యూత్ కాంగ్రెస్ బలమైన మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ప్రజల సమస్యలపై పోరాడే ధైర్యం, సమాజానికి సేవ చేయాలనే తపన యూత్ కాంగ్రెస్ లోని ప్రతి కార్యకర్తకు ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో యూత్ కాంగ్రెస్ పాత్ర మరువలేనిదని చెప్పారు. దేశంలో నిరంకుశ పాలన సాగిస్తున్న మోదీ ప్రభుత్వానికి యువత త్వరలో చరమగీతంపాడి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం ఖాయమన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలపై గత పది సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్ నిర్వహించిన పోరాటాల స్ఫూర్తితో నేడు ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతికను అందిపుచ్చుకోని ప్రభుత్వం చేపడుతున్న మంచిపనులను సామాజీక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించేలా యువజన కాంగ్రెస్ పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. యువజన కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన సమయంలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రజా సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఐవైసీ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువజన కాంగ్రెస్ కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సహాయ సహకారులు ఎప్పుడు ఉంటుందన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ బలోపేతానికి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ కృషి అభినందనీయమని వారు ప్రశంసించారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో 1500 మోటార్ సైకిళ్ళతో వైట్ హౌజ్ నుండి కొత్తబస్టాండ్, శంకర్ విలాస్, పాత బస్టాండ్, పిఎస్ఆర్ సెంటర్ మీదుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జవహార్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాధవరెడ్డి, గుర్రం శ్యాంచరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్యరెడ్డి, అంబేద్కర్, నవీన్ చారి, పట్టణ అధ్యక్షులు అంజత్ అలీ, మాజీ కౌన్సిలర్లు బైరు శైలేందర్, బాలు గౌడ్, రవి, రెబల్ శ్రీను, చేడే అంబేద్కర్, విజయభాస్కర్, ఏజాజ్, కుమార్, జావిద్, చెంచల నిఖీల్, కోరుకొప్పుల నరేష్, అజీం, కుక్కడపు మహేష్, పట్టణ అధ్యక్షులు బొడ్డు సాయి, యూత్ కాంగ్రెస్ మండలల పార్టీ అధ్యక్షులు శిగ నజీర్, వలి, సమీర్, నరేష్, అనిల్, శివ, అశోక్, ఎల్లేష్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
