Take a fresh look at your lifestyle.

ముగిసిన పోలీసు స్పోర్ట్స్ మీట్ బహుమతులు అందజేసిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా పోలీసు క్రీడా పోటీలు ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటారు. క్రీడల ద్వారా సిబ్బందిలో ఐక్యత, స్నేహభావం పెంపొందించడమే కాకుండా విధుల్లో ఉండే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు పేర్కొన్నారు.


క్రికెట్ ఫైనల్ లో డిఏఆర్ మెదక్ జట్టు విజేతగా నిలిచింది. కబడ్డీలో డిఏఆర్ మెదక్ జట్టు విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. వాలీబాల్ లో డిఏఆర్ మెదక్ జట్టు విజేతగా నిలిచింది.


బ్యాడ్మింటన్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో సత్యనారాయణ, సుధాకర్ గెలుపొందారు.
డబుల్స్ విభాగంలో యాదగిరి, దీనకర్ జోడీ విజేతలుగా నిలవగా, ఆంజనేయులు, రమేష్ జోడీ రన్నర్స్‌గా నిలిచారు. అధికారుల విభాగం బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ సీఐ మహేష్ జోడీ విజేతలుగా నిలిచారు. అధికారుల సింగిల్స్ విభాగంలో మెదక్ సీఐ మహేష్ విజేతగా నిలవగా, ఆర్ఎస్ఐ సుభాష్ రన్నర్‌గా నిలిచారు.
మహిళల విభాగంలో నిర్వహించిన పోటీల్లో తేజస్విని, దేవిభాయి విజేతలుగా నిలవగా, సరిత, కవిత రన్నర్స్‌గా నిలిచారు. మహిళల సింగిల్స్ విభాగంలో మౌనిక విజేతగా నిలవగా, పూజ రన్నర్‌గా నిలిచింది. పోటీల్లో విజయం సాధించిన సిబ్బందికి ఎస్పీ ట్రోఫీలు, మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, రంగనాథ్, సీఐలు జార్జ్, కృష్ణమూర్తి, సందీప్ రెడ్డి, మహేష్, ఆర్ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.