ముద్ర. తాండూర్: కాంగ్రెస్ ప్రభుత్వ అసాధ్యమైన వాగ్దానాలను చూసి మోసపోవద్దని 24వ వార్డ్ బిజెపి మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా గత ఐదు సంవత్సరాల కాలంలో 24వ వార్డులో తాను నిస్వార్థంగా సీసీ రోడ్లు, శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ దీపాలు, త్రాగునీటి సమస్య ఇలా ఎన్నో అభివృద్ధి పనులను చేశానని, రెండవసారి కూడా బిజెపికి ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారి సహాయంతో గతంలో కంటే కూడా ఇంకా రెట్టింపు అభివృద్ధి పనులు చేపడతానని, బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెబుతున్న మోసపూరిత వాగ్దానాలను ఎవరు నమ్మవద్దని, తాను అను నిత్యం ప్రజా సేవకై, పనిచేసే వ్యక్తినని, తప్పకుండా ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఆమె తెలిపారు.