ఏప్రిల్ నెలాఖరు వరకు ఎస్ ఆర్ ఎస్ పి నీళ్లు విడుదల చేయాలి.. వరి పంటలను ఎండిపోకుండా నీళ్లు విడుదల చేయాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత
ముద్ర ,తుంగతుర్తి…
ఎస్సారెస్పీ జలాలు ఈ నెల 3వ తారీకు వరకే చివరి విడత నీటి విడుదల పూర్తి అవుతుందని ఇరిగేషన్ అధికారులు ప్రకటించడంతో తుంగతుర్తి మండలంలో రెండువేల ఎకరాల వరి పంట ఎండిపోతుందని వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏప్రిల్ నెలాఖరు వరకు నీటి విడుదల చేయాలని మండల తహసీల్దార్కు బి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం మెమొరాండం అందించారు ఈ సందర్భంగా బి ఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం నీటి విడుదల ఆలస్యంగా విడుదల చేయడం వలన రైతులు ఆలస్యంగా వరి నాట్లు వేశారని వాటిని కాపాడేవిధంగా నీరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేసారు. ప్రభుత్వ అధికారులు స్పందించకుంటే ప్రజాపాలన.. సమావేశాల్లో రైతాంగం ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య ,జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్,మండలనాయకులు, తునికిసాయిలు, గోపగాని రమేష్. తడకమళ్ళ రవికుమార్, సోమనర్సయ్య, మాతంగి కర్ణాకర్ వెంకటయ్య, వెంకటేష్. సాయికిరణ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు