Take a fresh look at your lifestyle.

వికసిత భారత్ లక్ష్యంగా బీజేపీ పని చేస్తుంది

ముద్ర, రాయికల్: భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయికల్ మండలంలోని వివిధ గ్రామాలలో బీజేపీ జెండాలను బూత్ అధ్యక్షులు ఎగురవేశారు.భూపతిపూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మండల నాయకులు మాట్లాడుతూ, “దేశమే ముందు,ఆ తర్వాతే దేహమైనా,కుటుంబమైనా” అనే సిద్ధాంతంతో బీజేపీ ముందుకు సాగుతుందని అన్నారు.మాజీ ప్రధాని వాజ్ పేయి నుండి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు బీజేపీ వికసిత భారత్ లక్ష్యంగా పార్టీ పని చేస్తుందని,ఈ లక్ష్య సాధనలో కార్యకర్తల కృషి అమూల్యమైందని పేర్కొన్నారు. అంత్యోదయ భావనతో చివరి వ్యక్తి కల్యాణమే లక్ష్యంగా పార్టీ కొనసాగుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అన్నవేణి వేణు, ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్, ప్యాక్స్ ఛైర్మన్ ఏనుగు ముత్యం రెడ్డి, బూత్ అధ్యక్షులు బొడ్డుపెల్లి జగన్, బందెల నర్సారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.