ముద్ర కాప్రా
ఈసీఐఎల్ పీఎఫ్ ట్రస్ట్ ఖాతాల్లో భారీ మోసం వెలుగుచూసింది. కుషాయిగూడకు చెందిన ఈసీఐఎల్ ఉద్యోగి ఏ. సంతోష్ కుమార్ ఫిర్యాదు మేరకు… పీఎఫ్ ట్రస్ట్ ఖాతాల నుంచి ఫోర్జరీ సంతకాలతో రూ.41 లక్షల మేర అక్రమంగా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. విచారణలో ఈసీఐఎల్ పీఎఫ్ విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజారపు ఓంకార్ చెక్కులు దొంగిలించి, నకిలీ సంతకాలతో నగదు తన , తన భార్య ఖాతాల్లో జమ చేసినట్లు తేలింది. నాలుగు చెక్కుల్లో మూడు నగదుపరచగా, ఒక చెక్కు సంతకాల పొంతన లేక తిరస్కరించబడింది. ఈ ఘటనపై క్రైమ్ నెం.350/2026 కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజారపు ఓంకార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకు తరలించారు