Take a fresh look at your lifestyle.

ధన్వాడ మండల మత్సశాఖ అధ్యక్షులుగా అచ్చి బాబు

 

ముద్ర, నారాయణపేట:

ధన్వాడ మండల మాత్స్య శాఖ నూతన అధ్యక్షులుగా అచ్చిబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా మత్స సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ధన్వాడ మత్స్య సహకార సంఘ కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకోగా
అధ్యక్షులుగా అచ్చిబాబు, ఉపాధ్యక్షులు సాయి బాబా, కార్యదర్శి రాజు, డైరెక్టర్లు నీరటి బాబా, సంద బాలరాజు, చింతకాయల బాలయ్య, సుందరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్ష కార్యదర్శులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి జిల్లాలో ముదిరాజుల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించి అండగా నిలవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.