ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 10వవార్డు లింగంపేటలో ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కార్యక్రమంలో భాగంగా 13 లక్షలతో నిర్మించిన బస్తి దవాఖానాను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ. 10 లక్షలతో నిర్మించిన మరుగు దొడ్లను ప్రారంభించి, 8వ వార్డు భవానినగర్ లో రూ. 14లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానా లు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు అయ్యాయన్నారు.
మెడికల్ కాలేజీ,నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్ ఇలా అన్ని విధాలుగా జగిత్యాల మెడికల్ హబ్ గా అభివృద్ధి చేసుకున్నామన్నారు. జగిత్యాల జిల్లా గా ఏర్పడ్డ తర్వాత పట్టణ అభివృద్ధికి పరిసర గ్రామాలను శివారు ప్రాంతాలను కలపడం వల్ల అభివృద్ధి చేసుకున్నామన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో జాప్యానికి కారణం గత ప్రభుత్వ హయంలో నిధుల మంజూరు ఆలస్యమే ప్రధాన కారణమని, మెడికల్ కాలేజి మంజూరు చేసి గత ప్రభుత్వం లో నిధులు మంజూరు కాక కాంట్రాక్టర్ చేతులెత్తేసే పరిస్తితి వచ్చిందన్నారు.
పక్క నియోజక వర్గాల్లో సైతం డబల్ బెడ్ రూం ఇండ్ల ను గత ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది అని ఎన్ని పూర్తి చేశారో చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్, కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాలా జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భారతి రాజయ్య,చుక్క నవీన్, మాజీ ఎంపిటిసి తురగ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ నరసయ్య, మాజీ కౌన్సిలర్ మల్లవ్వ తిరుమలయ్య,వార్డు నాయకులు ఎల్ జీ రమేష్,గోపి,శ్రీనివాస్,భాస్కర్ రావు,మాధవ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.