Take a fresh look at your lifestyle.

జై బాపూ, జై భీమ్‌, జై సంవిధాన్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్

ముద్ర, గండిపేట్ విలేకరి : జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్య‌క్ర‌మంతో విజ‌య‌వంతం చేయాల‌ని రాజేంద్ర‌న‌గ‌ర్‌ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ అన్నారు. శుక్ర‌వారం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని నార్సింగి చౌరస్తాలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నార్సింగి చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమం అని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా ప‌ని చేయాల‌న్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, గండిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్, నార్సింగి మున్సిపాలిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెను గౌడ్, గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, కౌన్సిలర్లు అమరేందర్ రెడ్డి, దుర్గేష్, పార్టీ సీనియర్ నాయకులు ఎమ్. శ్రీనివాస్, కె. వినోద్, కె. రాము, వెంకటేష్ యాదవ్, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.