రామకృష్ణాపూర్, ముద్ర : రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాగర్ కు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూతనందించారు. కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఖర్చుల కొరకు పదివేల రూపాయలను శుక్రవారం అందించారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాగర్ ఆసుపత్రి ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందించాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. మహేందర్,తిరుపతి,సురేష్,సంపత్,సతీష్,మోహన్,లక్ష్మణ్ రావు,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.