- అభినందించిన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్.
ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆయన బాసర ట్రిపుల్ ఐటీలో చీఫ్ సెక్యూరిటీ అధికారి. విద్యపై ఉన్న మక్కువతో ఒక పక్క విధులు నిర్వహిస్తూనే మరో పక్క డాక్టరేట్ పట్టా సాధించి పలువురి ప్రశంసలు పొందుతున్నారు. ట్రిపుల్ ఐటీలో సి ఎస్ ఓ గా పని చేస్తున్న రాజేష్ ఈ ఘనతను సాధించారు.ఈ మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన రెండవ స్నాతకోత్సవంలో 2011 – 2012 అకాడమిక్ సంవత్సరానికి సంబంధించి పి హెచ్ డి పట్టాను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బిష్ణు దేవ్ శర్మ చేతుల మీదుగా అందు కున్నారు.ఆర్జీయూకేటీ బాసరలో సియస్ఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ డి. రాజేష్ కి డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డి ప్రొఫెసర్ మురళీధర్షన్ డాక్టర్ డి. రాజేష్ డిఎస్పి ని అభినందించారు. పోలీస్ శాఖలో డిఎస్పీగా విధులు నిర్వహిస్తూనే 5 మాస్టర్ డిగ్రీలు ఎం. ఏ తెలుగు, ఎం. ఏ హిస్టరీ, ఎం. ఎ హ్యూమన్ రైట్స్, ఎం. ఏ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. అయినా పట్టువీడని రాజేష్ ప్రత్యేక అంశంపై పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని మథుర బంజారాలపై భారత దేశంలోనే మొట్ట మొదటి పరిశోధన కొనసాగించారు. విద్య పట్ల ఆసక్తితో ప్రస్తుతం ఎల్ఎల్బి కోర్సును కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ డి రాజేష్ మాట్లాడుతూ విసి ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డి ప్రొఫెసర్ మురళీధర్షన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉన్నత స్థాయిలో ఎదగడానికి నిరంతరం ప్రోత్సహించిన తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, తోడై నడిపిస్తున్న జీవిత సహచరి ప్రొఫెసర్ లావణ్యకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు క్రమశిక్షణనేర్పి బలీయమైన పునాది నిర్మించిన మంత్రిప్రగడ శ్రీధర్ రావు, మానవత్వంతో, దృఢ సంకల్పంతో
- క్వాలిటీగా జీవించాలన్న
పట్టుదలను నేర్పిన కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి, జీవితాన్ని మలుపుతిప్పిన ఆధ్యాత్మిక గురువు శ్రీరామ్, పి హెచ్ డి అందుకొనడానికి ముఖ్యమైన కారకులు మధుర లాభాన్ తెగ రాష్ట్ర అధ్యక్షులు బస్సి తాన్సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
