ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత గౌడ్ శుక్రవారం కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రితో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బీర్ల శంకర్, ఇలియాస్ ఉన్నారు