Take a fresh look at your lifestyle.

శత శాతం ఉత్తీర్ణత సాధించాలి- కలెక్టర్ రాహుల్ రాజ్

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కుల్చారం మండలం పోతన్ శెట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు.
విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు.
సబ్జెక్టులను ఏ విధంగా చదవాలి, మంచి మార్కులు ఎలా స్కోర్ చేయాలో మెళకువలు తెలిపారు. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి పద్ధతికి స్వస్తి పలికి, విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తు.చ. తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని సూచించారు.
విద్యార్థులు టీవీ, ఫోన్, సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలన్నారు.
ఇష్టంతో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.