ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రజాప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన సర్కార్… దానికి సంబంధించిన రూ.514.36 కోట్లు సోమవారం విడుదల చేసింది. వానాకాలంలో సన్నవడ్లు అమ్మిన 2.17 లక్షల మంది రైతులకు ఈ బోనస్ బకాయిలు విడుదల చేసింది. ఈ బోనస్, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అదనంగా లభిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నబియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ధాన్యంలో తేమశాతం, గింజ నాణ్యతను బట్టి ఈ బోనస్ ఖరారు చేస్తారు. గత కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. పంట పెట్టుబడి పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ అదనపు రూ.500 తోడుగా నిలవనుంది.