మహేశ్వరం, ముద్ర ప్రతినిధి: బిఎంసి పరిధిలోని అల్మాస్ గూడ శ్రీ శ్రీ హోమ్స్ కాలనీలోని పార్కు స్థలాలు,కమ్యూనిటీ ప్రయోజనాలకు కేటాయించిన స్థలాలను కబ్జాదారుల నుంచి కాపాడటానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే,మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కిచన్నగారి లక్ష్మారెడ్డి చెప్పారు.బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి,వేణుగోపాల్, శ్రీశ్రీ హోమ్స్ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు శ్రీశ్రీ హోమ్స్ కాలనీ పార్కు స్థలాలు, కమ్యూనిటీ స్థలాలను పరి రక్షించాలని కోరుతూ కేఎల్ఆర్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ,అల్మాస్ గూడ శ్రీశ్రీ హోమ్స్ కాలనీలో బిల్డర్లు చేస్తున్న అక్రమాలను కాలనీ వాసులతో కలసి కాంగ్రెస్ నాయకులు నాకు విన్నావించడం జరిగిందన్నారు.లే అవుట్ ప్రకారం ఉన్న పబ్లిక్ పార్క్,స్విమ్మింగ్ పూల్,సంప్ హౌస్, స్కూల్ స్థలం కోసం అంతా కలసి 5400 చదరపు చదరపు గజాల స్థలం వదిలినట్లు చెప్పారు.ఇప్పుడు దాదాపు 1200 గజాల స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, సంప్ హౌస్ స్థలాలను శ్రీ శ్రీ హోమ్స్ బిల్డర్లు ఆక్రమించటానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని నా దృష్టికి రావడం వచ్చిందన్నారు.కాలనీలో ఉన్న స్విమ్మింగ్ పూల్, స్కూల్ సంబంధిత స్థలాలను కాపాడి, కమీషనర్ తో మాట్లాడి కాలనీకి సంబందించిన స్థలాలను తక్షణం మున్సిపాలిటీ స్వాధీనం చేసుకొని పార్క్ స్థలాలు అభివృద్ధి అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని చెబుతానని హామీ ఇచ్చారు.శ్రీశ్రీ హోమ్స్ కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ హోమ్స్ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మి నరసింహ్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సర్వేశ్వర్ రావు, యాదయ్య, సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అర్జున్, శేఖర్ రెడ్డి, వెంకటేశం
తదితరులు పాల్గొన్నారు.
Next Post