- ఎస్ ఏ వి గుప్తా ఉన్నత పాఠశాల 1997 బ్యాచ్
అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎస్ ఏ వి గుప్తా ఉన్నత పాఠశాల లో చదివిన 1997 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అపూర్వ సమ్మేళనానికి ఎక్కడెక్కడినుండో సుదూర ప్రాంతాల నుండి వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి విద్యార్థులందరూ కూడా హాజరై తమ క్లాస్ లో జరిగిన తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంతో గడిపారు. గతంలో కూడా ఈ యొక్క సమ్మేళనాన్ని నిర్వహించారు కానీ వయసు పెరిగే కొద్దీ ఇలా తమతో చదివిన విద్యార్థులను కలవడం వారి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొని మళ్లీ చిన్నపిల్లల వలె మారి తమ సరదా తీర్చుకున్నారు. ఈ సమ్మేళనంలో విద్యార్థులు ప్రవీణ, అనిత, ప్రసన్న, పుష్ప, రేణుక, సరిత, మరియు రఘురాం, ధనరాజ్, ప్రవీణ్, జహీర్, రాజేందర్, విజయ్, పవన్, శ్రీకాంత్, శంతన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు మొత్తం 38 మంది పాల్గొన్నారు.