ముద్ర, వనపర్తి :
తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, సుభిక్షం నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజలు సురక్షితంగా, ఆనందంగా పండుగను జరుపుకోవాలని, ముఖ్యంగా రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. పండుగ సందర్భాల్లో అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజల రక్షణకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధులను మరింత నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ ఉగాది పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఎస్పీ గారు హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.