Take a fresh look at your lifestyle.

హైడ్రా కూల్చివేతలు … పోచారం మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణాలపై కొరడా

  • నల్ల మల్లారెడ్డికి చెందిన 4 కిలోమీటర్ల ప్రహారీ కూల్చివేత

ముద్ర, తెలంగాణ బ్యూరో :- పోచారం మున్సిపాలిటీలోని దివ్య‌న‌గ‌ర్ లే అవుట్ లో ర‌హ‌దారుల‌ను మూసేసి అక్ర‌మంగా నిర్మించిన భారీ ప్ర‌హ‌రీని శ‌నివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. దాదాపు 200 ఎక‌రాల్లో 2218 ప్లాట్లుగా విస్త‌రించిన దివ్య లేఅవుట్స చుట్టూ 4 కిలోమీట‌ర్ల మేర నిర్మించిన ప్ర‌హ‌రీని నేల‌మ‌ట్టం చేశారు. దీనిని కూల్చి వేయ‌డంతో ఏక‌శిలా, వెంక‌టాద్రి టౌన్‌షిప్‌, సుప్ర‌భాత్‌ వెంచ‌ర్ -1 , మ‌హేశ్వ‌రి కాల‌నీ, క‌చ్చ‌వాణి సింగారం, ఏక‌శిలా – పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీన‌గ‌ర్, సుప్ర‌భాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాల‌నీ, ప్ర‌తాప్ సింగారం రోడ్డు, సుప్ర‌భాత్ వెంచ‌ర్ -2, 3, సాయిప్రియ‌, మేడిప‌ల్లి, ప‌ర్వ‌త‌పురం, చెన్నారెడ్డి కాల‌నీ, హిల్స్ వ్యూ కాల‌నీ, ముత్తెల్లిగూడ నివాస ప్రాంతాల‌కు దారులు తెరుచుకునేందుకు అవకాశం లభించినట్లు అయింది. దీంతో దివ్య లే అవుట్ లోని ప్లాట్ల య‌జ‌మానులు, ప‌రిస‌ర కాల‌నీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.


నివాస ప్రాంతాలు, కాల‌నీల వారు ర‌హ‌దారుల‌కు ఆటంకం క‌లిగించడం నిబంధనలకు విరుద్దం. దీని కోసం ప్ర‌త్యేకంగా అనుమ‌తులు తీసుకోవాల్సి ఉంటుంది. కాని దివ్య‌లేఔట్ గేటెడ్ క‌మ్యూనిటీ కానప్పటికీ. నా లే ఔట్ చుట్టూ 4 కిలోమీట‌ర్ల‌మేర అక్ర‌మంగా భారీ ప్ర‌హ‌రీని నిర్మించ‌డాన్ని హైడ్రా తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఈ నేపథ్యంలో మున్సిప‌ల్‌ చట్టం, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం ర‌హ‌దారుల‌కు ఆటంకాలు క‌ల్పించే విధంగా ఏవైనా క‌ట్ట‌డాలు చేప‌డితే నోటీసు కూడా లేకుండా కూల్చివేయవచ్చు అని స్పష్టంగా ఉంది. వీటి ఆదారంగా దివ్య లే అవుట్ చుట్టూ ఉన్న ప్ర‌హ‌రీని హైడ్రా కూల్చివేసింది.

Leave A Reply

Your email address will not be published.