Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా ఆంజనేయస్వామి జన్మదినోత్సవ వేడుకలు . వేలాది సంఖ్యలో ర్యాలీగా బయలుదేరైన హిందూ బంధువులు

 

ముద్ర, తాండూర్: హిందువుల ఆరాధ్య దైవమైన హనుమాన్ జన్మదినోత్సవ ర్యాలీని వైభవంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి స్టేషన్ హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, హనుమాన్ శోభాయాత్ర ర్యాలీని ప్రారంభించారు. స్టేషన్ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన హనుమాన్ శోభయాత్ర ర్యాలీలో వేలాది సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొని జైశ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ, కళాకారుల ఆటపాటలు,డప్పు వాయిద్యాలు, కళాకారుల కోలాటాల మధ్య పురవీధుల గుండా హనుమాన్ శోభాయాత్ర ర్యాలీని నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య, ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందో బస్తూ నిర్వహించారు. కార్యక్రమంలోహిందూ సంఘాల నేతలు, యువజన సంఘాల నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, ఆర్బిఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి, వివిధ పార్టీల కౌన్సిలర్లు, వివిధ గ్రామాల హిందూ సంఘాల నేతలు, పట్టణ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.