ముద్ర కూకట్‌పల్లి :
కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఓ మైనర్ బాలుడు ఇంట్లో ఉన్న నగదు, బంగారంతో కనిపించకుండా పోయిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్యనగర్‌కు చెందిన నంద్యాల నాగార్జున రెడ్డి కుమారుడు నంద్యాల సిద్ధార్థ రెడ్డి (17) అనే విద్యార్థి గురువారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ తన వెంట స్ప్లెండర్ మోటార్ సైకిల్‌ను తీసుకువెళ్లాడు. బైక్‌ను ఎక్కడో ఒకచోట వదిలేస్తానని ఓ లేఖ రాసి వెళ్ళినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బీరువాను తనిఖీ చేయగా.. అందులో ఉన్న రూ. 8 లక్షల నగదు, 9 తులాల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. సిద్ధార్థ రెడ్డి మొబైల్ ఫోన్ (9347067298) ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తోంది. గతంలో కూడా సదరు బాలుడు రెండుసార్లు ఇలాగే ఇంటి నుండి వెళ్ళిపోయాడని ఫిర్యాదుదారు తెలిపారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్.ఐ టి. అవినాష్ బాబు ఆధ్వర్యంలో బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.