Take a fresh look at your lifestyle.

ఆన్ లైన్ ద్వారానే ఇసుక అనుమతులు -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.

 

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి , సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, జిల్లాలో ఇసుక సరఫరా, వినియోగం, నిల్వలు, రవాణా తదితర అంశాలపై రెవెన్యూ అదనపు కలెక్టర్ రాజేశ్వరిలతో కలిసి మైన్స్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం అవసరమైన ఇసుక ను పూర్తి గా ఆన్లైన్ విధానం లోనే చేసుకొని పొందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించడంతో పాటు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు.
ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.ఇసుక నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. పి పి టి ద్వారా ఇసుక ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే విదా నాన్ని ఇ డి ఎం మహమ్మద్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఈ ఈ పి ఆర్ ఉమేష్,ఎ డి మైనింగ్ సత్యనారాయణ, పెద్దేముల్, బషీరాబాద్, బొంరాస్ పేట్, తాండూర్ మండలాల తహసీల్దార్ లు, పంచాయతీ సెక్రటరీ లు, డి ఇ లు, ఎ ఇ లు,సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.