Take a fresh look at your lifestyle.

వన దుర్గ సేవలో రాష్ట్ర కమీషనర్ రాహుల్ రాజ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమీషనర్ రాహుల్ రాజ్ (మెదక్ మాజీ కలెక్టర్) ఏడుపాయల వన దుర్గ భవాని మాత అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ… మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం ఎంతో చారిత్రాత్మక ఆలయంగా ప్రసిద్ధికెక్కిందని, భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారని  భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుందన్నారు. మహిమాన్విత వన దుర్గ భవాని అమ్మవారి ఆశీస్సులతో జిల్లాలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.