ముద్ర ప్రతినిధి, మెదక్:
విద్యుత్ ఆర్టిజెన్స్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో గత 7 రోజులుగా కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెలో పాల్గొని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, విద్యుత్ కార్మికుల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే వారం రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు వెంటనే స్పందించి కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని కోరారు.
ఈ కార్యకర్తమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్, జుబెర్ అహ్మద్, ఉదయ్ కుమార్, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం. అంజాగౌడ్, నాయకులు పూసల సంతోష్, సునీల్, ఇందాద్, మోహన్, మహిళా నాయకురాలు చంద్రకళ, రాధ, విద్యుత్ కార్మికులు తదితరులున్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.