ముద్ర ప్రతినిధి, మెదక్:
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. కలెక్టర్ ప్రతిమా సింగ్
అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా, కలెక్టరేట్ లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీ.వి శ్రీనివాసరావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, షెడ్యూల్ కులముల మార్గదర్శకులు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు సాధించని స్వేచ్ఛ భారతదేశం సాధించిందంటే అది డాక్టర్ అంబేద్కర్ కృషి అన్నారు.

ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యాంగం స్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రసాదించిందని, సమాజంలో ప్రజలందరూ ఆనందంగా జీవించేందుకు రాజ్యాంగం దోహదపడిందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ ఛైర్ పర్సన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి, డిఆర్డిఓ శ్రీనివాసరావు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఎఫ్ఓ జోజి, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, అంబేద్కర్ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు ఆకుల పెంటయ్య, కమిటీ చైర్మన్ దుబాషి సంజీవ్, వైస్ చైర్మన్ గరుగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, కార్యదర్శి నాగరాజు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పురపాలక సంఘంలో

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు నివాళులు అర్పించారు. వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్,సంధ్య నవీన్, ఉదయ్ కుమార్,గౌస్, సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం చంద్రకళ, రాధ, నాయకులు కిష్ట గౌడ్, అంజగౌడ్, కిష్టయ్య, విశ్వం, లింగారెడ్డి, ప్రభు రెడ్డి, కిషన్, మాయ మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, ఏనుగుల రాజు, సునీల్, రవి, లక్ష్మీనారాయణ, దశరథం, ఇందాడ్, సంతోష్, వెంకట్, ఆంజనేయులు, ప్రభాకర్, లక్ష్మణ్, కిషన్, మోహన్, ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో

భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు పిలుపునిచ్చారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఏం గంగాధర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్.
మాట్లాడుతూ… డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని తెలిపారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. సమానత్వం,సామాజిక న్యాయం సాధనలో అంబేద్కర్ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతినరేష్ గౌడ్, కౌన్సిలర్లు ఎండి మన్సూర్ అహ్మద్, అరుణ సిద్దిరాములు, గంట సంపత్, హరిత నర్సింగ్ రావు, శశాంక్, అవారి రాజశేఖర్, తొడుపునూరి శివరామకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, నాయకులు బొజ్జ పవన్, సయ్యద్ ఉమర్, ఎండి ఆమెన్, ముజాంబిల్, సండే శ్రీకాంత్, షఫీ, దయాసాగర్, బాలరాజు యాదవ్,గూడూరు ఆంజనేయులు,లంబాడి దేవుల నాయక్, ప్రవీణ్, స్వరూప,దానోల భవాని,గోదాల కృష్ణ, జాయ్ జాయ్ ముర్రే, ప్రభాకర్, ప్రవీణ్ గౌడ్, పిల్లి కొట్టాల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.