Take a fresh look at your lifestyle.

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ తప్పనిసరి – రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాచం శ్రీనివాస్ సూచన

 

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:

ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను రిటైర్డ్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 17వ తేదీ లోపు పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాచం శ్రీనివాస్ సూచించారు.
మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాచం శ్రీనివాస్, ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్లతో పాటు బీడీ కార్మికుల పెన్షనర్లు కూడా తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని తెలిపారు.
పెన్షన్ పొందుతున్న ప్రతి లబ్ధిదారు నిర్దేశించిన గడువు లోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే, వారి పెన్షన్ నిలిచిపోవచ్చన్నారు. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.
అలాగే ప్రభుత్వం అందిస్తున్న వివిధ ఉచిత సేవలను కూడా రిటైర్డ్ ఉద్యోగులు ఉపయోగించుకోవాలని, వాటి గురించి అవగాహన పెంచుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. అధికారులు ఇచ్చిన గడువును గౌరవిస్తూ, ప్రతి పెన్షనర్ తమ బాధ్యతగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. పెన్సర్లు ఏదైనా అవసరం ఉంటే సంప్రదించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.