Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయాలి -130 సర్వే నంబర్లు అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలి.

. అక్రమ నిర్మాణాలపై కమిషనర్ కు ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు.

ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో సర్వే నంబర్ 130లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై బి.ఆర్.ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్, సామాజిక కార్యకర్త కౌన్సిలర్ ఇర్షాద్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
“సర్వే నంబర్ 130లో ఉన్న భూమి నిస్సందేహంగా ప్రభుత్వ భూమి. కొంతమంది ప్రభావశీలులు చట్టాలను తమ కాళ్ల కింద పెట్టుకుని, అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అక్రమంగా ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది కేవలం ఆక్రమణ కాదు… ప్రజల ఆస్తిని దోచుకోవడమే” అని ఆయన మండిపడ్డారు.
“దమ్ముంటే ఆ భూమి పట్ట భూమి అని రికార్డులతో సహా నిరూపించండి. మేము మాత్రం పక్కా ఆధారాలతో ఇది ప్రభుత్వ భూమి అని నిరూపిస్తాం” అని సూటిగా సవాల్ చేశారు.
“ఈ భూమి ప్రభుత్వ భూమి అని నిరూపించే అన్ని సంబంధిత డాక్యుమెంట్స్ ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ గారికి అధికారికంగా సమర్పించడం జరిగిందని అయినప్పటికీ చర్యలు ఆలస్యం అవుతుండటం విచారకరం” అని తెలిపారు.
“ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే పీడీ యాక్ట్ (PD Act) కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలి. అక్రమాలకు పాల్పడేవారిని ఏ మాత్రం ఉపేక్షించ వద్దనిఎంత పెద్ద వ్యక్తి అయినా చట్టం ముందు తలవంచాల్సిందే” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
“ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఉన్న అసలు దోషులను బయటపెడతాం. ఎవరి ప్రమేయం ఉన్నా ప్రజల ముందు నిలబెడతాం. అధికారుల సహకారం ఉన్నట్లు తేలితే వారిపైనా చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేస్తాం” అని వారు స్పష్టం చేశారు.
“ప్రభుత్వ భూములు కాపాడటం మా బాధ్యత మాత్రమే కాదు… మా సంకల్పం. తాండూర్ పట్టణంలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే తప్పకుండా అడ్డుకుంటామని, ప్రజల హక్కులను రక్షించడంలో ఎలాంటి రాజీ పడడం ఉండదని వారు తెలిపారు. మేము సాక్షాలతో సహా 130 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి అని నిరూపిస్తామని, అక్రమ నిర్మాణాలు చేపట్టేవారు పట్టా భూమి అని నిరూపించుకోవాలని నిజం ఎవరిదో ప్రజల ముందు బహిర్గతమవుతుందని, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించు కునేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.