Take a fresh look at your lifestyle.

ఇసుక రవాణాకు అనుమతులు తప్పనిసరి- కలెక్టర్ ప్రతీక్ జైన్

 

-తహసీల్దార్ల పనితీరు పై కలెక్టర్ అసహనం వ్యక్తం

-ఇసుక అక్రమ రవాణా కు చెక్ పెట్టాలి.

 

ముద్ర, నారాయణ పేట :

జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్ లతో పాటు రెవెన్యూ,వాటర్ షెడ్ పరిధిలోని చెక్ డ్యాం ల వద్ద నుంచి ఇసుక రవాణా చేసేందుకు అనుమతులు తప్పనిసరి అని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి కలెక్టర్ అధ్యక్షతన డి.ఎల్.ఎస్.సి( డిస్టిక్ లెవెల్ స్యాoడ్ కమిటీ) సమావేశం గూగుల్ మీట్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఇసుక తరలింపు విషయంలో మైనింగ్, రెవెన్యూ, భూగర్భ జల శాఖ, సర్వే ల్యాండ్, నీటి పారుదల,వ్యవసాయ శాఖల అధికారుల నివేదికలు,అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఇరిగేషన్, నీటి జల వనరుల శాఖ ఏ డీ ని ప్రశ్నించారు. మాగనూరు మండలంలోని 5 ఇసుక రీచ్ లు, ఉట్కూర్ మండలంలో 2, మక్తల్ లో రెండు,ధన్వాడ గోటూరు, కొత్తపల్లి, లింగాల చేడ్ రీచ్ ల నుంచి ఇసుక రవాణా కు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని మైనింగ్ ఏడి వివరించారు. గుర్తించిన ప్రాంతాల నుంచి నిబంధనల మేరకు ఇసుక రవాణా కు అనుమతులు ఇవ్వాలని, ఆయా ప్రాంతాలలో సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి, పారదర్శక మైన నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఒకరిద్దరు తహసీల్దార్ల పనితీరు పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

భూగర్భ జలాలను సంరక్షించుకోవాలి

జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో బుధవారం భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన భూగర్భ జలాల వినియోగం – సంరక్షణ పై జిల్లా అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. వ్యవసాయానికి భూగర్భజల వనరులపై ప్రధానంగా ఆధారపడటం తగ్గించు కోవాలని పరిమితంగా వినియోగించుకోవాలని కోరారు.
నీటిని సృష్టించలేం కానీ సంరక్షించుకోగలం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇష్టారాజ్యంగా భూగర్భజలాల్ని వెలికితీయడం కాకుండా వాన నీటిని సాధ్యమైనంత వరకు భూమిలో ఎక్కువగా లోపలి ఇంకింప చేసే విషయాలపై దృష్టి పెట్టాలని నీటి సంరక్షణ మన అందరి సామాజిక బాధ్యత అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నారాయణపేట జిల్లా క్రియాశీలక భూగర్భ జల వనరులు పుస్తకం విడుదల చేశారు.

Leave A Reply

Your email address will not be published.