సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో సృజన 55వ ర్యాంకుతో మెరవగా.. డీఎస్‌కే ప్రచేత్ 193, వర్షిత్ రెడ్డి 259, పవన్‌కుమార్ రెడ్డి 297, విక్రమసింహారెడ్డి 541, శ్వేత 573, ప్రమోద్ విష్ణు 640, విజయసింహారెడ్డి 682, భార్గవ్ 738, రాహుల్ 748, శ్రవణ్‌కుమార్ 768, అనిరుధ్ కత్తిమాని 786, శ్రీకర్‌రాజు 806, శ్రీరామ్ హర్ష 823, ప్రత్యూష 908, రాజశేఖర్ 920, జితేందర్ నాయక్ 939వ ర్యాంకులతో అద్భుత ప్రతిభ కనబరిచారు.
సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.సింగరేణి సంస్థ అధ్వర్యంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది.రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 51 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు.
వీరిలో 20 మంది సివిల్స్ తుది ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజేతలుగా నిలిచారు.రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
