Take a fresh look at your lifestyle.

వృత్తి నైపుణ్యం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం…. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి నైపుణ్యం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అడ్వాన్సుడ్ టెక్నికల్ సెంటర్ ఏ టి సి కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో విద్యార్థుల నైపుణ్య శిక్షణలో భాగంగా చెక్కపై రూపొందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చిత్రాన్ని జగిత్యాల ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వర్ రెడ్డి, సిబ్బంది మౌనిక లు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం అభివృద్ధికి నియోజకవర్గాల్లో నూతనంగా రూ.35కోట్ల చొప్పున ఐటిఐ లను అప్గ్రేడ్ చేసి 65 ఏటిసి కేంద్రాలను యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ కోర్సులను అందించి ఉపాధి అవకాశాలను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. ఇటీవల జగిత్యాలలో ఏటీసీ కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించడం జరిగింది అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 15 రోజుల కాల వ్యవధితో ఆరు బ్యాచ్ లను సర్టిఫికెట్ కోర్సులు ఏటిసి అందజేస్తుందని, యువత ఇట్టి అవకాశాలను ఉపయోగించుకోవాలని అన్నారు. విద్యార్థులకు రహదారి ఇబ్బందులు లేకుండా మంత్రి శ్రీధర్ బాబు చొరవతో రూ.70 లక్షలతో సీసీ రోడ్డు సైతం వేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముస్కు ఎల్లారెడ్డి ,ముప్పాళ్ళ రామచంద్రరావు ,గట్టు సతీష్, సమీండ్ల శ్రీనివాస్, సురేందర్రావు, తిరుమలయ్య, శ్రీనివాస్, మల్లయ్య, కొలగని సత్యం, శరత్ రావు, భూమయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.