గొల్లపల్లి, ముద్ర: జగిత్యాల జిల్లా లోని గొల్లపల్లి మండల భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన చెవులమద్ది శేఖర్ నియమితులైన సందర్భంగా గురువారం కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జాతీయ కౌన్సిల్ నెంబర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి శాలువాతో సత్కరించిన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గతంలో ఎబివిపి నాయకునిగా విద్యార్థి దశ నుంచే విద్యార్థుల సమస్యల పట్ల పోరాటం చేశారని పది సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దళిత మోర్చా మండల అధ్యక్షులుగా చేశారన్నారు.త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని ఆయన సూచించారు. శేఖర్ మాట్లాడుతూ తన నియామకం పార్టీ కోసం నిబద్దతతో అంకిత భావంతో పని చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గౌరవం అన్నారు ఒక దళిత సామాజిక వర్గానికి ఇప్పటి వరకు ఏ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఒక్క బీజేపీ పార్టీ సామాజిక న్యాయం చేసిందన్నారు మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తానన్నారు.నా నియామకానికి కృషి చేసిన పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ధర్మపరి నియోజకవర్గ ఇన్ ఛార్జి కన్నం అంజన్న,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొమ్ము రాంబాబు, మాజీ మండల అధ్యక్షులు కట్ట మహేష్ మండల బీజేవైఎం అధ్యక్షులు లక్కకుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
