మల్యాల,ముద్ర విలేఖరి: మండలంలోని తాటిపెల్లి బాలికలు గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8వ తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి గురువారం అడ్మిషన్ టెస్ట్ నిర్వహించారు. 368 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 325 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎగ్జామ్ సెంటర్ ను ఎంఈవో జయసింహారావు, ప్రిన్సిపాల్ మానస పర్యవేక్షించారు.