ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గం లోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల నివాసంలో అందజేశారు.వివిధ కారణాలతోని ఆసుపత్రిలో చికిత్స పొంది వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి కొరకు ఎమ్మెల్సీకి అర్జీ చేసుకోగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ సీఎం సహాయనిది నుండి జగిత్యాల పట్టణానికి చెందిన చెట్టే గంగరాజుకు రూ .24 వేలు, సామల రిషికాకు రూ . 11వేలు, ఆరవెల్లి గ్రామానికి చెందిన మంద రాజవ్వకు రూ. 11వేలు మంజూరయ్యాయి. చెక్కులను జగిత్యాల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరవెల్లి మాజీ సర్పంచ్ లక్ష్మణ్, బి ఆర్ ఎస్ అనే పార్టీ నాయకులు అల్లాల ఆనంద్ రావు, వోల్లం మల్లేశం, వొళ్ళాల గంగాధర్, దయ్యాల మల్లారెడ్డి, కోరుకంటి రాము, కుడిక్యాల సర్వేశ్వర్, గంగిపెల్లి శేకర్, గాజుల శ్రీనివాస్, పెండెం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
