ముద్ర : ఆత్మకూరు (ఎం)
ఆత్మకూరు మండల కేంద్రంలో హై స్కూల్ నుండి రాయగిరి- మోత్కూర్ రోడ్డు వరకు నిర్మాణం చేపట్టే సీసీ రోడ్డు పనులను మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కోరారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య రోడ్డు నిర్మాణ పనుల కోసం 2.5 కోట్ల రూపాయలను మంజూరు చేయించారని వారికి సందర్భంగా మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డును పరిశీలించిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి ,మాజీ సర్పంచ్ జె నగేష్ ,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతగాని మల్లేష్ , గుడి కమిటీ చైర్మన్ గుండె గాని ఐలయ్య, డి. భాస్కర్, వార్డు సభ్యులు బూడిద శేఖర్, నోముల యాదగిరి రంగ శ్రీను, తవిటి రాజు, కోరే మల్లేష్ యాస సుభాష్, లోడి మహేష్ తదితరులు ఉన్నారు.