ముద్ర, శేరిలింగంపల్లి:
జీ హెచ్ ఎంసీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10వ తేదీన ముగుస్తున్న సందర్భంగా ఐదు సంవత్సరాలు విజయవంతంగా పదవి బాధ్యతలు పూర్తిచేసుకున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి లను జీ హెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా పదవికి న్యాయం చేస్తూ ఇతర మహిళలకు ఆదర్షంగా నిలిచారని వారి సేవలను కొనియాడారు. భవిష్యత్ లో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.