వికారాబాద్, ముద్ర విలేకరి : వికారాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.ఆ దొంగతనాలను మరవకముందే సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వెంకటేశ్వర కాలనీలో ఇంటిముందు ఆగి ఉన్న కొత్త మహేంద్ర ఎక్స్ యు వి 700 కారును దొంగిలించారు.అదే వెంకటేశ్వర కాలనీలో గత రెండు వారాల క్రితం పలు ఇండ్లలో గస్తీ నిర్వహించి దొంగతనానికి యత్నించారు.ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న తన ఎక్స్యువి 700 మహేంద్ర బ్లాక్ కలర్ కారును ఎత్తుకెళ్లారని కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం రెండు మూడు రోజులకే రెండు ఇండ్లలో చోరీ జరిగింది. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలోని మణికంఠ నగర్ లో సైతం పలు ఇండ్లలో చోరీ జరిగింది. దీంతో ఆ కాలనీవాసులు కర్రలు పట్టుకొని రాత్రిపూట గస్తీ చేస్తున్నారు.వికారాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు.పట్టణంలో ఎన్నో సీసీ కెమెరాలు ఉన్న దొంగలు మాత్రం దొరకడం లేదు. పోలీసులు గస్తి నిఘాను పెంచి దొంగలను పట్టుకొని పోయిన ఆస్తులను రికవరీ చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.