యైటింక్లయిన్ కాలని, ముద్ర: సింగరేణి రామగుండం రెండవ డివిజన్ గనుల్లో ఈ ఆర్థిక సంవత్సరం 99 శాతం బొగ్గు ఉత్పత్తి సాధ్యమైంది. ఈ మేరకు డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో, డివిజన్ జనరల్ మేనేజర్ బి. వెంకటయ్య ఉత్పత్తి వివరాలు వెల్లడించారు.డివిజన్ పరిధిలోని ఓసిపి.త్రి ప్రాజెక్టు, వకీల్ పల్లి గని లో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, ఓవర్ బర్దన్ (మట్టి) వెలికితీత, రవాణా జరిగిన వివరాలను వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పతి లక్ష్యాలు 98,70,000 టన్నులకు గాను, 97,77,937 టన్నులు, ఓవర్ బర్డెన్ వెలికితీత లక్ష్యాలు 6,03,48,000 క్యుబిక్ మీటర్లకు గాను, 4,55,70,002 క్యూభిక్ మీటర్లతో 76% తీయడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో ఓసిపి-3 కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుండి 86,73,922 టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఇక రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరములో వంద శాతం ఉత్పత్తి సాధించే దిశ లో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు జీఎం కోరారు.అలాగే ఏరియాలో ఉద్యోగుల, పరిసర గ్రామాల ప్రజల కొరకు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను జీఎం వివరించారు. ఈ సమావేశంలో
డివిజన్ ఇంజినీర్ నరసింహారావ్, డివిజన్ అఫిషియేటింగ్ ప్రాజెక్ట్ అధికారి & ఎస్ఓ టు జీఎం ఎం. రాముడు, డిజిఎం (పర్సనల్) & అధికార ప్రతినిధి ఎస్.అనిల్ కుమార్, ఏజీఎం వర్క్ షాప్ ఎర్రన్న, డిజిఎం లు మురళీకృష్ణ, ధనుంజయ, వెంకట రామచంద్ర, సెక్యూరిటి అధికారి షరీఫ్ మహమ్మద్ పాల్గొన్నారు.
Next Post