గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపనతో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మలుపు అని, టెక్ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే ఘట్టమని అన్నారు.

గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజ సంస్థ రాష్ట్రంలో విశాఖపట్నంకే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల క్రితం హైదరాబాదు సైబరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసిన విధంగానే, ఇప్పుడు విశాఖను డేటా మరియు ఏఐ అభివృద్ధి చేస్తానని చెప్పారు. Google డేటా సెంటర్ ఏర్పాటుతో 2026 ఏప్రిల్ 28 భారత చరిత్రలో నిలిచిపోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుండగా, ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అవుతుందని చెప్పారు. దీనితో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఏఐ డేటా గేట్‌వేగా ఎదుగుతుందని అన్నారు. సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైన గూగుల్, ఇప్పుడు భారత్ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌గా మారబోతోందని.
ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి అదానీ గ్రూప్ మరియు భారతి ఎయిర్‌టెల్ వంటి సంస్థలు భాగస్వామ్యంగా పనిచేస్తున్నాయని చెప్పారు. 2028 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని, ముఖ్యంగా నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గోదావరి నీటిని 60 రోజుల్లో విశాఖకు తీసుకురావాలని ప్రణాళిక.
అదేవిధంగా, పాలనలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, సీఎంఓలో ఏఐ అసిస్టెంట్‌ను కూడా ప్రవేశపెట్టారు. రవాణా రంగంలో బుల్లెట్ ట్రైన్, ఆధునిక రైల్వే స్టేషన్లు, మరియు సౌత్ కోస్టల్ రైల్వే జోన్ నోటిఫికేషన్ వంటి అంశాలను ప్రస్తావించారు.
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి దేశానికి అంకితం ఇచ్చారు. అలాగే 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. గూగుల్ రాకతో విశాఖ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం గతంలో వలసలు, నిరుద్యోగానికి ప్రసిద్ధి కాగా, ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని సీఎం అన్నారు. జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు.
అనకాపల్లి జిల్లాను మరో రంగారెడ్డి జిల్లాగా అభివృద్ధి చేసి, పరిశ్రమలు, టెక్నాలజీ, లాజిస్టిక్స్ రంగాల్లో కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మొత్తంగా గూగుల్ ఏఐ హబ్ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కాకుండా ఆసియాలో కూడా టెక్నాలజీ శక్తిగా నిలబెట్టే కీలక అడుగుగా మారనుందని ఆయన పేర్కొన్నారు.