- సివిల్ సప్లై గోదాం డి.టికు సమ్మె నోటీసు.
- హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
- సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్.
అచ్చంపేట ముద్ర విలేఖరి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట: కార్మికులు దశాబ్ద కాలం పాటు పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాయడం దుర్మార్గమని వాటికి వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9న కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ కార్మికుల ను కోరారు.అచ్చంపేట సివిల్ సప్లై గోదాం డిటి మోతీ లాల్ కు సమ్మె నోటీసులు అందజేశారు మరియు గింజల కొనుగోలు చేసే మార్కెట్ సెక్రెటరీ నరసింహ కు సమ్మె నోటీసులు హమాలీల ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు.హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులకు వారి అభివృద్ధికి తోడ్పాటు అయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి బి రాములు నాయకులు శివకుమార్ సైదులు చంద్రయ్య రేనయ్య లక్ష్మయ్య జంగయ్య దాసియ వేనయ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
