- జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.
- గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
- సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్.
అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలోని ఎంపీడీవో కు జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసును సిఐటియు కార్మిక సంఘం గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలలో నెలల తరబడి పనిచేస్తున్న జీతాలు రాకపోతే వాళ్ళ కుటుంబం ఎట్లా గడుపుతుందని అధికారులను శంకర్ నాయక్ ప్రశ్నించారు.పాలకులు మారుతున్న గ్రామపంచాయతీ కార్మికుల బతుకులు మారటం లేదని శంకర్ నాయక్ అన్నారు.పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు పాలకులు లక్షల కోట్ల రూపాయలు రాయతీ ప్రకటిస్తారని, గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం జీతభత్యాలు పెంచే విషయంలో బాధ్యతరహితంగా ఉంటున్నారని వారి పక్షాన పాలకులు ఆలోచన చేయాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు నిరంజన్ మండల నాయకులు కృష్ణయ్య బాలరాజు శ్రీశైలం శివ లీల, వెంకటమ్మ పద్మ కురువమ్మ తదితరులు పాల్గొన్నారు.

