యువకునితో ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు.
మోత్కూర్ ముద్ర న్యూస్: మండలంలోని ముషిపట్ల (శివ నగర్) గ్రామానికి చెందిన విద్యార్థిని మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది పాఠశాలకు వస్తూ పోతూ ఉండడంతో అదే గ్రామానికి చెందిన బుషిపాక భాను అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని విద్యార్థిని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.ఈనెల 16న విద్యార్థిని ఇంట్లో ఎవరు లేకపోవడంతో విద్యార్థిని ఒంటరిగా ఉండడం చూసి సదరు యువకుడు ఆ విద్యార్థినిపై అత్యాచారం చేయబోయాడు. విద్యార్థిని సహకరించక పోవడంతో విద్యార్థిని గొంతు నులిమి హత్య చేయబోయాడు సదరు యువకునీ నుండి విద్యార్థిని తప్పించుకొని ఇంటి బయటకు రావడంతో ఆ యువకుడు పారిపోయాడని అతనితో నాకు ప్రాణహాని ఉండదని నాకు నా కుటుంబ సభ్యులకు తగు రక్షణ కల్పించి సదరు యువకుని పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కోరుతున్నారు.