మహదేవపురం ముద్ర:
ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలరని తెలిపారు. అందుకే ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ఈ మెగా ఆరోగ్య శిబిరం ద్వారా వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఐడిఓసి కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో మెడికవర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో మెడికవర్, ప్రభుత్వ వైద్య బృందము రక్తపోటు, షుగర్, గుండె, కంటి సంబంధిత పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగులకు ఆరోగ్య సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, టిజిఓ కార్యదర్శి సునీల్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు డా.మధుసూదన్, ఫణి కుమార్, డా వెంకన్న, సంతోష్, శ్రీనివాసరావు, స్వాతి టీజీఓ ప్రతినిధులు, మెడికవర్, ప్రభుత్వ వైద్యులు డా శ్రీదేవి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.