Take a fresh look at your lifestyle.

పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలి -కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లో  వివిధ సెక్షన్ లను సందర్శించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని వివిధ జిల్లా శాఖల కార్యాలయాలతోపాటు ప్రాంగణంలో స్వచ్చత, పరిశుభ్రత పనులు పరిశీలించారు.
నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని అన్నారు. ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలని
రికార్డులు, ఫైళ్లు నిబంధనల ప్రకారం భద్రపరచాలని సిబ్బందిని ఆదేశించారు
అదనపు కలెక్టర్ నగేష్ సందర్శన
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
మెదక్ పట్టణంలోని 26 వార్డు లో పర్యటించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ కౌన్సిలర్ జుబేర్, సిబ్బంది తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.