ముద్ర పెబ్బేర్ :
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తానందు ఎస్సై హిమబిందు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పకుండా వాడాలని సూచించారు. వాహనానికి తప్పనిసరిగా అన్ని డాక్యుమెంట్స్ ఉండాలని ఆమె పేర్కొన్నారు. పరిమితికి మించి ఆటోలలో, బులోరాలలో ఎక్కించరాదని ఎస్సై అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ మధు, శ్రీను, శివాని తదితరులు పాల్గొన్నారు.