భారతదేశంలోనే అగ్ర సంతానసాఫల్య సంరక్షణ నెటవర్క్‌లలో ఒకటి అయిన ఒయాసిస్ ఫర్టిలిటీ నగరంలోని కోకాపేటలో అత్యాధునిక కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దేశంలోనే అత్యున్నత డిమాండ్ మార్కెట్ అయిన అత్యాధునిక సంతానసాఫల్య సంరక్షణను పెంచడానికి, అందరికీ అందుబాటులోకి తేవాలన్న తమ ప్రణాళికలో భాగంగా దాదాప 16 సంవత్సరాల క్లినికల్ నైపుణ్యం కలిగి ఒయాసిస్ ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. కోకాపేట్ కేంద్రం ప్రారంభంతో ఇది నగరంలో తొమ్మిదవ కేంద్రాన్నిప్రారంభించడం ద్వారా నగరంలో తన ఉనికిని బలోపేతం చేసుకుంటోంది. ఇది దేశంలో ఒయాసిస్ కేంద్రాలలో 35వది కానుంది.
సంతానసాఫల్యత సవాళ్ల గురించి అవగాహన పెరుగుతుండడం, నగర జీవనశైలి వంటి అంశాలు ఆలశ్యంగా పిల్లలు కావాలనుకుండడంతో హైదరాబాద్ నగరంలో ప్రత్యేక సంతానసాఫల్య సేవలకు డిమాండ్ క్రమంగా పెరిగింది. ఫలితాలను ప్రభావితం చేసే జాప్యాలు లేకుండా జంటలు క్రమం తప్పకుండా రోగ నిర్ధారణ, నిర్మాణాత్మక చికిత్సా మార్గాలు, వ్యక్తిగతీకరించిన సంరక్షణను పొందేందుకు కోకాపేట కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పదే పదే గర్భస్రావాలు, ఐవిఎఫ్ విఫలం కావడం, పునరావృత ఇంప్లాంటేషన్ వైఫల్యాలు, ట్రయల్-అండ్-ఎర్రర్ నమూనా కంటే మూల కారణాలను గుర్తించడం, వ్యక్తిగతీకరించిన చికిత్సా ప్రణాళికలను అందించడంపై దృష్టి సారించే శాస్త్రీయ విధానం ద్వారా అన్నిరకాల వంధ్యత్వ సవాళ్లను ఎదుర్కొనేందుకు జంటలకు ఒయాసిస్ ఫెర్టిలిటీ అందించే తోడ్పాటును విస్త్రతంగా గుర్తింపు పొందింది. ఒయాసిస్ ఫర్టిలిటీ అభివృద్ధి ప్రయాణంలో హైదరాబాద్ ఒక ముఖ్యభాగమని, ఇక్కడ తమ విస్తరణ కేవలం గణాంకాల కోసం కాక అవసరాన్ని బట్టి ఉందని ఒయాసిస్ ఫర్టిలిటీ సహ వవ్యవస్థాపకులు, మెడికల్ డైరెక్టర్ డా. దుర్గా జి. రావ్ అన్నారు. సంతానసాఫల్యత గురించి అవగాహన, పెరిగిన డిమాండ్ కారణంగా నగరంలో ప్రణాళికాబద్ధమైన విస్తరణ అవసరమని పుష్కరాజ్ షెనాయ్ అన్నారు. కోకాపేట్ కేంద్రం ప్రారంభంతో పశ్చిమ హైదరాబాద్ ప్రజలు అత్యాధునిక సంతానసాఫల్య సంరక్షణను తమ ఇంటికి దగ్గరే పొందవచ్చని ఒయాసిస్ ఫర్టిలిటీ, కోకాపేట కన్సల్టెంట్ డా. వల్లభరెడ్డి దేవి శ్యామల్ అన్నారు.కోకాపేట కేంద్రం ఐవిఎఫ్, పురుషుల, స్త్రీల వంద్యత్వాన్ని ఐయుఐ, సాఫల్యత పరిరక్షణ, అత్యాధునిక రోగనిర్ధారణ, అనుభవజ్ఞులైన వైద్యులు, ప్రామాణీకరించిన క్లినికల్ ప్రోటోకాళ్లతో సమగ్ర సంతానసాఫల్య సేవలను అందిస్తుంది.