Take a fresh look at your lifestyle.

అకాల వర్షం- రైతన్నల స్థితి ఆగమాగం

  • ధాన్యం కొనుగోలు సెంటర్లలో తడిసి ముద్దయిన ధాన్యం.
  • భారీ వర్షంతో పలు సెంటర్లో కొట్టుకుపోయిన వరి ధాన్యం.
  • ఉరుములు పిడుగులు మెరుపులతో ప్రకృతి విలయతాండవం.
  • గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవన స్రవంతి అతలాకుతలం.
  • ధాన్యం కొనుగోలు సెంటర్లలో కాంటాల ఆలస్యం ఆందోళన చెందుతున్న రైతులు- పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు.

ముద్ర,తుంగతుర్తి : గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది.ఆరుగాలం కస్టించి పండించిన పంట ధాన్యం కొనుగోలు సెంటర్లో పోసి నెలరోజులు గడుస్తున్న ధాన్యం కాంటాలు కాకపోవడంతో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. నెల రోజులుగా ఎండపోసిన దాన్యం తీరా కాంటాలు వేసే దశలో కురిసిన భారీ వర్షంతో రైతులకు కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.ఏ రైతును కదిలించిన తమ ధాన్యం వర్షానికి తడిసిపోయిందని తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. గత నెల రోజులుగా కొనుగోలు సెంటర్లో ధాన్యం నీలుగుతున్న కాంటాలు పెట్టే పరిస్థితి లేదని ఇదేమని అడిగితే కొనుగోలు సెంటర్ల వాళ్లు లారీలు రావడంలేదని బస్తాలు లేవని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదని మాటలు చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం ఒకపక్క 80% పైగా కొనుగోలు జరిగాయని చెబుతుండగా కొనుగోలు సెంటర్లో కనీసం 30% కూడా కొనుగోలు కాలేదనేది కళ్ళకు కనిపిస్తున్న దృశ్యం.అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గాని తమ గూడు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తమ ధాన్యం కొనుగోలు సెంటర్లో పోసి నెలలు గడుస్తున్నా కాంటాలు కావడం లేదు అనే మాట యావత్ రైతాంగం చెబుతోంది.పిడుగులతో మెరుపులు ఉరుములతో భారీ వర్షం కురియడంతో కనీసం ధాన్యం రాశుల వద్ద కూడా రైతులు వెళ్లే పరిస్థితి లేదు. అర్ధరాత్రి భారీ వర్షం దంచి కొడితే ధాన్యం రాశుల మీద కప్పించిన పట్టాలు గాలికి ఎగిరిపోయాయి.దీంతో ఎండిన ధాన్యం రాసులు జలమయమయ్యాయి. కొంతమేర ధాన్యం వరదకు కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి మండలంలోని యావత్ కొనుగోలు సెంటర్లలో ఇదే పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు.ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించి రైతుల బాధలను పట్టించుకోని ధాన్యం కాంటాలు వేసి మిల్లర్లు దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు.మిల్లర్ల ఏకపక్ష నిర్ణయాల వల్ల దాన్యంలో కోతలు కూడా పెడుతున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లర్ల వద్ద లారీ లాగడంతో లారీ డ్రైవర్ల ఖర్చులు కూడా రైతులే భరించాలని నేరుగా రైతుల వద్ద ఒక బస్తాకు రెండు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు పలువురు రైతుల ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇస్తామని చెప్పడంతో ఆశపడిన రైతులకు మద్దతు ధర సంగతి దేవుడెరుగు కానీ పలు రకాలుగా రైతులు దోపిడీకి గురవుతున్నారని మాట సర్వత్రాభినవస్తుంది.ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు సెంటర్లో జరుగుతున్న గోల్మాల్ ను మిల్లర్ల చేతివాటాన్ని అరికట్టాలని యావత్ రైతాంగం కోరుతుంది.

Leave A Reply

Your email address will not be published.